భారతదేశం, జూలై 20 -- డాన్ మూవీతో బాలీవుడ్ లో గతంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ చంద్ర బరోత్ మరణించారు. 86 ఏళ్ల ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. అమితాబ్ బచ్చన్ నటించిన డాన్ సినిమాతో చంద్ర పేరు మార్మోగింది. గత ఏడేళ్లుగా చంద్ర బరోట్ పల్మనరీ ఫైబ్రోసిస్ తో బాధపడుతున్నట్లు ఆయన సతీమణి దీప తెలిపారు. ఆయనను గురునానక్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించారు.

చంద్ర బరోత్ మృతి పట్ల బాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 'ఓజీ డాన్ డైరెక్టర్ ఇక లేరనే వార్త విని బాధపడ్డాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలి చంద్ర బరోత్జీ . ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని డాన్ మూడో భాగానికి దర్శకత్వం వహిస్తున్న ఫర్హాన్ అక్తర్ పేర్కొన్నారు.

దర్శకుడు కునాల్ కోహ్లీ ఎక్స్ లో.. "చంద్ర జీ మీ ఆత్మకు శాంతి చేకూరాలి. నేను అసిస్టెంట్ గా పని చేసి...