భారతదేశం, ఏప్రిల్ 20 -- అథ్లెటిక్స్ కోచ్ అంటే.. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో నాగపురి రమేష్ పేరు కచ్చితంగా వినిపిస్తోంది. తెలంగాణకు చెందిన ఆయన ఎంతోమంది ఛాంపియన్లను సానబెట్టారు. ద్రోణాచార్య అవార్డు కూడా అందుకున్నారు. కానీ తాజాగా ఆయనపై జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ (నాడా) సస్పెన్షన్ విధించింది. ఆదివారం (ఏప్రిల్ 20) ఈ వార్త భారత అథ్లెటిక్స్ లో కలకలం రేపింది. ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటున్న అథ్లెట్లు డోపింగ్ టెస్టుకు నిరాకరించడమే అందుకు కారణం.

నాగపురి రమేష్ ప్రస్తుతం హైదరాబాద్ లోని సాయ్ సెంటర్ లో అథ్లెట్లకు శిక్షణ అందిస్తున్నారు. 2023 నుంచి భారత జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ గా ఆయన పని చేస్తున్నారు. అయితే ఆయన దగ్గర ట్రెయినింగ్ తీసుకుంటున్న ఇద్దరు అథ్లెట్లు డోపింగ్ టెస్టుకు నిరాకరించారు. ఈ ఇద్దరికీ రమేష్ హెల్ప్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయ...