భారతదేశం, ఆగస్టు 3 -- తక్కువ మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ, వారితో టచ్​లో ఉండేందుకు మీరు 'లైవ్​' ఫీచర్​ని ఎక్కువ ఉపయోగిస్తుంటారా? అయితే, ఇక మీదట మీరు అలా చేయలేరు! ఇక ఇన్​స్టాగ్రామ్​ లైవ్​ ఫీచర్​ని ఉపయోగించుకునేందుకు 'అర్హత' ఉండాలి. ఇన్​స్టా ప్రకటించిన కొత్త రూల్స్​ ప్రకారం.. లైవ్ సర్వీస్​ని యాక్సెస్ చేయడానికి వినియోగదారులకు కనీసం 1000 మంది ఫాలోవర్లతో కూడిన పబ్లిక్ అకౌంట్ ఉండాల్సిందే.

లైవ్ స్ట్రీమింగ్ అనేది వినియోగదారులు తమ ఫాలోవర్లతో రియల్​-టైమ్​ కనెక్ట్ అవ్వడానికి ఒక ముఖ్యమైన ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్. కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో తక్కువ ఫాలోవర్లు ఉన్న చాలా మంది చిన్న క్రియేటర్‌లు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.

గతంలో, ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ఫీచర్ ఫాలోవర్ల సంఖ్య లేదా పబ్లిక్ లేదా ప్రైవేట్ అకౌంట్ కలిగి ఉండటంతో సంబంధం లేకుండా అందరు వినియోగదారులకు అ...