భారతదేశం, ఏప్రిల్ 7 -- హజ్ యాత్ర దగ్గరపడుతున్న వేళ సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. హజ్ యాత్రకు ముందే 14 దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఉమ్రా, వ్యాపార, ఫ్యామిలీ విజిట్ వీసాలకు ఈ నిషేధం వర్తిస్తుంది. జూన్ మధ్యకాలం వరకూ అంటే హజ్ యాత్ర ముగిసేదాకా ఈ నిషేధం అమలులో ఉంటుంది.

భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సహా 14 దేశాల పౌరులకు వీసాల జారీని సౌదీ అరేబియా తాత్కాలికంగా నిలిపివేసింది. జూన్ మధ్య వరకు కొనసాగే ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ విజిట్ వీసాల ఆమోదంపై ఇది ప్రభావం చూపనుంది. హజ్ యాత్ర సమయం దగ్గర పడుతుండటంతో రద్దీని నియంత్రించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ నిషేధాన్ని విధించినట్లు భావిస్తున్నారు. జూన్ మధ్య వరకు ఈ నిషేధం అమల్లో ఉంది.

భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, నైజీరియా, జోర్డాన్, అల్జీరియా, సూ...