భారతదేశం, ఫిబ్రవరి 7 -- షాకింగ్.. నేపాలీ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. 300కు పైగా సినిమాలు చేసిన లెెజెండరీ నటుడు సునీల్ థాపా కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. 68 ఏళ్ల వయసులో ఆయన మరణించారు.

'ది ఖాట్మండు పోస్ట్' ప్రకారం శుక్రవారం (ఫిబ్రవరి 6) ఉదయం నేపాల్ రాజధాని ఖాట్మండులో సునీల్ థాపా మరణించారు. గుండెపోటుతో సునీల్ తుదిశ్వాస విడిచారు. తపస్థలిలోని నోర్విక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. హార్ట్ ఎటాక్ తో ఆయన ప్రాణాలు విడిచారు.

నేపాలీ సినీ ఇండస్ట్రీలో సునీల్ థాపా దిగ్గజం. అక్కడి అభిమానుల్లో ఆయన తెలియని వారు ఉండరు. ముఖ్యంగా విలన్ పాత్రలతో ఆయన ప్రసిద్ధి చెందారు. ఇండియన్ సినీ లవర్స్ కు కూడా సునీల్ పరిచయమే. ప్రియాంక చోప్రా లీడ్ రోల్ ప్లే చేసిన 'మేరీ కోమ్' సినిమాలో సునీల్ తన యాక్టింగ్ త...