భారతదేశం, డిసెంబర్ 7 -- భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన సంచలన నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడైన సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ తో తన వివాహం రద్దు అయినట్లు ఆమె ప్రకటించింది. ఆదివారం స్మృతి మంధాన ఇన్ స్టాగ్రామ్ లో ఈ సంచలన పోస్ట్ పెట్టింది. గత కొన్ని వారాలుగా వార్తల్లో నిలిచిన ఈ సంబంధానికి ఇలా ఆకస్మాత్తుగా ముగింపు పలికింది.

భారత విమెన్స్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కఠిన పరిస్థితులు ఎదుర్కొంటోంది. తన ప్రియుడు పలాష్ ముచ్చల్ ను ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంది. మెహందీ, సంగీత్ లాంటి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. కానీ పెళ్లి రోజు స్మృతి మంధాన తండ్రికి హార్ట్ స్ట్రోక్ కారణంగా పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు వివాహం రద్దు అయినట్లు ఆదివారం (డిసెంబర్ 7) స్మృతి మంధాన పోస్ట్ పెట్టింది.

భారత వైస్-కెప్టెన్ స్మృతి మంధాన ఈ పరిస్థితిని ఎదుర్కోవడా...