భారతదేశం, నవంబర్ 23 -- సందడిగా హల్దీ, సంగీత్ వేడుకలు.. కాబోయే వరుడితో కలిసి డ్యాన్స్.. టీమిండియా వుమెన్ క్రికెటర్ల సందడి.. ఇలా అంగరంగ వైభవంగా జరుగుతున్న భారత క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వేడుకుల అర్ధాంతరంగా ఆగిపోయాయి. భారత క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం ఈరోజు (నవంబర్ 23) జరగాల్సి ఉండగా, ఒక వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా వాయిదా పడింది. స్మృతి మంధాన తండ్రికి గుండె పోటు రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఇండియన్ వుమెన్ క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధానకు గుండె పోటు వచ్చినట్లు సమాచారం. ఈ కారణంతోనే స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడిందని తెలిసింది. పీటీఐ నివేదిక ప్రకారం స్మృతి మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా.. స్మృతి తండ్రి ఆరోగ్యం బాగోలేదని, అందువల్ల వివాహం నిరవధికంగా వాయిదా పడిందని ధృవీకరించారు.

ఎన్డీటీవీ...