భారతదేశం, నవంబర్ 22 -- షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పంజాబీ స్టార్ సింగర్ హర్మాన్ సిద్ధూ ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్‌లోని మానసా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కారు ట్రక్కును ఢీకొనడంతో పంజాబీ గాయకుడు హర్మాన్ సిద్దూ మరణించారు.

ప్రముఖ పంజాబీ గాయకుడు హర్మాన్ సిద్దూ శనివారం, నవంబర్ 22, 2025న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన వయస్సు 37 సంవత్సరాలు. పంజాబ్‌లోని మానసా జిల్లా సమీపంలోని ఖియాలా గ్రామానికి చెందిన సిద్దూ, మానసా-పటియాలా రహదారిపై ప్రమాదం జరిగినప్పుడు ఇంటికి తిరిగి వస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఆయన కారు ట్రక్కును ఢీకొనడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రత కారణంగా హర్మాన్ సిద్దూ అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది.

ప్రమాదం...