భారతదేశం, జూలై 14 -- భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన భర్త పారుపల్లి కశ్యప్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సైనా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆదివారం (జూలై 13) రాత్రి సైనా ఇన్ స్టాగ్రామ్ లో ఓ పర్సనల్ అప్ డేట్ ను పోస్ట్ చేయడం క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ జంట విడిపోవడం ఊహించనిదే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సైనా, కశ్యప్.

''జీవితం ఒక్కోసారి మనల్ని వివిధ దిశల్లో తీసుకెళ్తుంది. చాలా ఆలోచించిన తర్వాత నేను, కశ్యప్ పారుపల్లి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా కోసం ఒకరికొకరం శాంతి, వృద్ధిని, హీలింగ్ ను కోరుకుంటున్నాం. ఆ జ్ఞాపకాలకు నేను కృతజ్ఞురాలిని. ఉత్తమంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నా. ఈ సమయంలో మా ప్రైవసీని అర్థం చేసుకున్నందుకు, గౌరవించినందుకు ధన్యవాదాలు'' అని సైనా నెహ్వాల్ సోషల్ మీడియాలో పోస్...