భారతదేశం, నవంబర్ 28 -- తెలుగులో గతవారం థియేటర్లలో రిలీజైన సినిమాల్లో ఒకటి పాంచ్ మినార్ (Paanch Minar). రాజ్ తరుణ్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. ఐఎండీబీలోనూ 9.3 రేటింగ్ సాధించింది. అయినా వారం రోజుల్లోనే ఈ మూవీని డిజిటల్ ప్రీమియర్ చేయాలన్న మేకర్స్ నిర్ణయం షాక్‌కు గురి చేస్తోంది.

రాజ్ తరుణ్, రాశీ సింగ్ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ పాంచ్ మినార్. ఈ సినిమా నవంబర్ 21న థియేటర్లలో రిలీజైంది. సరిగ్గా వారం రోజుల్లోనే అంటే శుక్రవారం (నవంబర్ 28) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. అసలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం.

రామ్ కుడుముల ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. బాక్సాఫీస్ దగ్గర అసలు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో మేకర్స్ సరిగ్గా ఏడు రోజుల్లోనే మూవీని స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఓటీటీలో...