భారతదేశం, జూలై 21 -- ఇటలీలో జరిగిన జీటీ4 యూరోపియన్ సిరీస్ రేసులో నటుడు, రేసర్ అజిత్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది. అయితే అతనికి ఎలాంటి గాయాలు కాకపోవడం ఉపశమనాన్నిచ్చే వార్తే. అజిత్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సిరీస్ రెండో రౌండ్లో మిసానో ట్రాక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం నుంచి బయటపడ్డ తర్వాత అజిత్ చేసిన పని నెట్టింట వైరల్ గా మారింది.

రేసర్లు ట్రాక్ ఎక్కారంటే అందరికంటే ముందు టార్గెట్ రీచ్ కావాలనే లక్ష్యంతోనే ఉంటారు. ఒకవేళ మధ్యలో కారు ప్రమాదానికి గురైతే డిసప్పాయింట్మెంట్ తో అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ స్టార్ హీరో అజిత్ కుమార్ చేసిన పని వైరల్ గా మారింది. ట్రాక్ పై కారు శిథిలాలను తొలగించడానికి ఈ తమిళ స్టార్ అక్కడి సిబ్బందికి హెల్ప్ చేశాడు. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి.

జీటీ4 యూరోపియన్ సిరీస్ అధికారిక ఎక్స్ పేజీలో అజ...