భారతదేశం, జూలై 16 -- వరుసగా హిట్ సినిమాలతో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రేంజ్ పెరిగిపోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఫస్ట్ టైమ్ సినిమా చేస్తున్నాడు లోకేష్. దీని టైటిల్ కూలీ. ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా నుంచి రిలీజైన రెండు పాటలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం లోకేష్ తీసుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.

లోకేష్ కనగరాజ్, రజినీకాంత్ కాంబినేషన్లో వస్తున్న కూలీ సినిమాను రూ.350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం రజనీకాంత్ రూ. 150 కోట్లు, లోకేష్ రూ. 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై లోకేష్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో కూలీ సినిమా కోసం రూ.50 కోట్లు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. అంతే కాకుండా తన గత సినిమా హిట్ తర్వాత రెమ్యునరేషన్ డబుల్ అయింద...