భారతదేశం, నవంబర్ 17 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ పదకొండో వారం నామినేషన్లలో షాక్. లవ్ బర్డ్స్ అంటూ హౌమ్ మేట్స్, ఆడియన్స్ అనుకుంటున్న రీతు చౌదరి, డీమాన్ పవన్ మధ్య నామినేషన్ వార్ జరిగింది. రీతును పవన్ నామినేట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ వేరే లెవల్ అనేందుకు ఇదే నిదర్శనం.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ 11వ వారం నామినేషన్ ప్రక్రియ హోరీహోరీగా సాగింది. హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి రీతు, పవన్ క్లోజ్ గానే ఉంటున్నారు. వీళ్ల మధ్య మంచి బాండ్ ఏర్పడింది. అది లవ్ అని హౌస్ మేట్స్ అంటూనే ఉన్నారు. ఇది లవర్స్ పార్క్ లా ఉందని కూడా హౌస్ నుంచి వెళ్లిపోయిన అయేషా, రమ్య మోక్ష చెప్పారు. రీతు కూడా పవన్ తో స్పెషల్ బాండ్ ఫామ్ అయిందని, అది నా ఇష్టం అని కూడా స్పష్టం చేసింది. అలాంటిది రీతును డీమాన్ పవన్ నామినేట్ చేశాడు.

ఈ వారం బిగ...