భారతదేశం, నవంబర్ 13 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ పదో వారంలో ఓటింగ్ తారుమారవుతోంది. డేంజర్ జోన్లో ఉన్నవాళ్లు సేఫ్ జోన్లోకు, సేఫ్ జోన్లో ఉన్నవాళ్లు డేంజర్ జోన్లోకు వెళ్తున్నారు. ఈ వారం ఓటింగ్ కాస్త షాకింగ్ గానే ఉంది. ఇప్పుడు రీతు చౌదరి సడెన్ గా ఎలిమినేషన్ కు దగ్గరైంది. ఇక ఈ వారం హౌస్ లోకి చెఫ్ సంజయ్ తుమ్మ వెళ్లారు.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో పదో వారం నామినేషన్లలో 10 మంది ఉన్నారు. తనుజ పుట్టస్వామి, కల్యాణ్ పడాల, సుమన్ శెట్టి, భరణి, డీమాన్ పవన్, సంజన గల్రానీ, దివ్య నిఖిత, నిఖిత్ నాయర్, గౌరవ్ గుప్తా, రీతు చౌదరి నామినేషన్లలో ఉన్నారు. ఇందులో నుంచి ఈ వారం ఒకరు ఎలిమినేట్ అవుతారు.

ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్ షాకింగ్ గానే ఉంది. ఎప్పటికప్పుడూ ఓటింగ్ పరంగా చూస్తే కంటెస్టెంట్ల స్థానాలు మారుతున్నాయి. బుధవారం చూస్తే తనుజాను వెనక్కినెట్టి కల్యాణ్ పడాల టాప్ ...