భారతదేశం, ఆగస్టు 24 -- ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ కు వేళైంది. బిగ్ బాస్ హిందీ 19వ సీజన్ కు నేడే తెరలేవనుంది. ఇవాళ (ఆగస్టు 24) రాత్రి బిగ్ బాస్ ప్రీమియర్ ఉంది. బిగ్ బాస్ కొత్త ఎడిషన్ ప్రారంభం కానుండటంతో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మళ్లీ బుల్లితెరపై సందడి చేయనున్నాడు. ఈ షోకు ఉన్న క్రేజ్ కారణంగా భారీగా ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రియాలిటీ షో హోస్ట్ సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.

బిగ్ బాస్ 19 సీజన్ కోసం సల్మాన్ ఖాన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ పై ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. గత సీజన్ కంటే ఈ సారి సల్మాన్ ఖాన్ కు రూ.100 కోట్లు తక్కువ దక్కనున్నాయని తెలిసింది. బిగ్ బాస్ 19 సీజన్ లో హోస్ట్ గా సల్మాన్ ఖాన్ వీకెండ్ కు రూ.10 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ సారి సల్మాన్ కేవలం మూడు నెలలు మాత్రమే ఈ ...