భారతదేశం, అక్టోబర్ 8 -- హోరాహోరీగా సాగుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోకు దెబ్బ పడింది. ఈ పాపులర్ షో కన్నడ సీజన్ కు షాక్ తగిలింది. బిగ్ బాస్ 12 కన్నడ సీజన్ కు బ్రేక్ వచ్చింది. ఈ సీజన్ లో ఉన్న బిగ్ బాస్ హౌస్ ను సీజ్ చేశారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో కర్ణాటక ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఇప్పుడిది కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది.

బిగ్ బాస్ కన్నడలో 12వ సీజన్ ఇటీవల సెప్టెంబర్ 28న స్టార్ట్ అయింది. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు సెకండ్ వీక్ నడుస్తోంది. ఇంతలోనే బిగ్ బాస్ హౌస్ కు సీజ్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ హౌస్ లోని కంటెస్టెంట్లను బయటకు పంపించి అధికారులు సీజ్ వేశారని తెలిసింది. ఈ సీజన్ కు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్.

బిగ్ బాస్ కన్నడ 12వ సీజన్ హౌస్ ను సీజ్ చేయడం కలకలం రేపుతోంది....