భారతదేశం, జూన్ 21 -- థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన నాని సినిమా హిట్ 3కి షాక్ తగిలింది. మద్రాస్ హై కోర్టు నానితో పాటు హిట్ 3 టీమ్ కు తాజాగా లీగల్ నోటీసులు పంపించింది. ఈ సినిమా కథను తన నుంచి కాపీ కొట్టారని స్క్రిప్ట్ రైటర్ విమలవేలన్ అలియాస్ విమల్ ఆరోపించారు. విమల్ పిటిషన్ తో మద్రాస్ హై కోర్టు నోటీసులు పంపించింది.

సూపర్ హిట్ ఫ్రాంఛైజీ హిట్ లో మూడో సినిమాగా హిట్ ది థర్డ్ కేస్ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా స్టోరీ తనదేనని విమల్ ఆరోపిస్తున్నారు. స్టోరీ కాపీ కొట్టారంటూ అతను మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు లైవ్ లా నివేదిక పేర్కొంది. హిట్ 3 స్టోరీ తన కథకు అనధికారిక అనుసరణ అని విమల్ హైకోర్టుకు తెలిపారు. ఇది 2021 ఆగస్టు 4 న సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్లో రిజిస్టర్ అయిన స్క్రిప్ట్ కాపీ అని అతను పేర్కొన్నారు.

తనతో కలిసి ప...