భారతదేశం, సెప్టెంబర్ 4 -- షాకింగ్.. హిందీ టెలివిజన్ నటుడు అశిష్ కపూర్‌పై రేప్ ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అతణ్ని అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. పోలీసులను ఉటంకిస్తూ, ఏఎన్‌ఐ వార్తా సంస్థ ఈ కేసు జాతీయ రాజధానిలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైందని తెలిపింది. పోలీసులు అతని కదలికలను అనేక ప్రదేశాలలో ట్రాక్ చేసిన తర్వాత పుణెలో అశిష్‌ను అరెస్ట్ చేశారు.

పోలీసుల రిపోర్ట్ ప్రకారం ఫిర్యాదుదారు మహిళ ఆగస్టు రెండవ వారంలో ఢిల్లీలో జరిగిన ఓ హౌస్ పార్టీలో పాల్గొంది. ఇక్కడ బాత్రూమ్ లో అశిష్ తనపై లైంగికంగా దాడి చేశాడని ఆరోపించింది. ఆగస్టు 11న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు అతని కోసం గాలించడం ప్రారంభించారు. ఆ బాధితురాలు తొలి ఫిర్యాదులో ఆశిష్ తో పాటు మరికొంతమందిని పేర్కొంది. కానీ తరువాత కంప్లెయింట్ ఛేంజ్ చేసింది.

తొలి...