భారతదేశం, మే 29 -- అద్భుతమైన యాక్టింగ్ తో హాలీవుడ్ రేంజ్ కు ఎదిగింది ప్రియాంక చోప్రా. గ్లోబల్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆమె ఓ సమయంలో అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంది. వ్యక్తిగతంగా కష్టాలు పడింది. తండ్రికి క్యాన్సర్ సోకడంతో తీవ్రంగా బాధపడింది. కానీ తన ప్రొఫెషనల్ ఎథిక్స్ ను వదల్లేదు. పనిచేయడాన్ని మానలేదు. డెడికేషన్ తో సినిమా షూటింగ్ లో పాల్గొంది. ఈ విషయాన్ని తాజాగా అర్జన్ బజ్వా వెల్లడించాడు.

2013లో దీర్ఘకాలిక క్యాన్సర్‌తో ప్రియాంక చోప్రా తండ్రి అశోక్ చోప్రా మరణించారు. 'ఫ్యాషన్' చిత్రంలో ప్రియాంకతో కలిసి నటించిన నటుడు అర్జన్ బజ్వా.. ఈ సినిమా షూటింగ్ సంగతులను గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రియాంక తండ్రికి క్యాన్సర్ అని తెలిసిందని చెప్పాడు. సిద్ధార్థ్ కన్నన్ కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో.. ప్రియాంక ఎంతో కష...