భారతదేశం, అక్టోబర్ 7 -- షాకింగ్.. బెంగళూరులో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. సినిమాలో అవకాశం ఇస్తానని ఓ హీరోయిన్ ను లైంగిక వేధించిన విషయం హాట్ టాపిక్ గా మారింది. నటుడు, దర్శకుడు, నిర్మాత బి.ఐ. హేమంత్ కుమార్‌ను లైంగిక వేధింపులు, మోసం, నేరపూరిత బెదిరింపుల ఆరోపణలపై రాజరాజేశ్వరి నగర్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. ఇండియా టుడే నివేదిక ప్రకారం ఓ టెలివిజన్ నటి, రియాలిటీ షో విజేత కూడా అయిన హీరోయిన్ ఫిర్యాదు మేరకు ఈ అరెస్టు జరిగింది. సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి తనను మోసం చేశాడని ఆమె ఆరోపించింది.

2022లో హేమంత్ నటిని సంప్రదించి సినిమాలో అవకాశం ఇస్తానని వాగ్దానం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. సినిమా టైటిల్ గురించి వేర్వేరు కథనాలు వినిపిస్తున్నాయి. ఎన్డీటీవీ దానిని 3 అని, ఇండియా టుడే దానిని రిచి అని పేర్కొన్నాయి. రూ.2 లక్షల పారితోషికానికి ఇద్దర...