భారతదేశం, డిసెంబర్ 24 -- బాలీవుడ్ స్టార్ హీరో, దీపికా పదుకొణె భర్త రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ, ఇప్పటికే రూ. 900 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

అయితే, ఈ భారీ సక్సెస్ ఇప్పుడు 'డాన్ 3' ప్రాజెక్టు ఎఫెక్ట్ పడింది. బాలీవుడ్ హీరో, డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో 'డాన్'గా మెప్పించాల్సిన రణ్‌వీర్ సింగ్ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు బి-టౌన్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

'దురంధర్'లో రణ్‌వీర్ పోషించిన పాత్రకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వరుసగా గ్యాంగ్‌స్టర్ లేదా యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమాలు చేయడం ఇష్టం లేకనే రణ్‌వీర్ సింగ్ 'డాన్ 3' నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

సంజయ్ లీలా భన్సాలీ,...