భారతదేశం, ఫిబ్రవరి 11 -- ఓటీటీలో రిలీజ్ కావాల్సిన మూవీ చివరి నిమిషంలో థియేటర్లలోకి వెళ్తుండటం విశేషం. '#90s' వెబ్ సిరీస్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించిన నటుడు శివాజీ వరుస విజయాలతో దూసుకుపోతూ మరో క్రైమ్ థ్రిల్లర్ తో రానున్నాడు. అతడు ప్రధాన పాత్రలో, నిర్మాతగా వ్యవహరిస్తూ తెరకెక్కించిన తాజా సినిమా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' (Sampradayini Suppini Suddapoosani). దాదాపు దశాబ్దం తర్వాత శివాజీ, లయ కలిసి నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదల విషయంలో ఒక అనూహ్యమైన మార్పు జరిగింది.

ముందుగా ప్రకటించిన ప్రకారం.. ఈ సినిమా గురువారం అంటే ఫిబ్రవరి 12న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్' (ETV Win)లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. దీన్ని ఒక 'డైరెక్ట్ టు ఓటీటీ' మూవీగానే ప్రమోట్ చేశారు. కానీ స్ట్రీమింగ్‌కు కేవలం కొన్న...