భారతదేశం, డిసెంబర్ 29 -- రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న పెద్ది మూవీ నుంచి అప్పలసూరి అనే పాత్ర ఫస్ట్ లుక్ ను మేకర్స్ సోమవారం (డిసెంబర్ 29) రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ చూడగానే ఫ్యాన్స్ షాక్ తిన్నారు. ఇందులో ఉన్నది జగపతి బాబు అని తెలిసి ముక్కున వేలేసుకున్నారు.

పైనున్న ఫొటో చూశారు కదా? అది జగపతి బాబు అంటే నమ్మగలరా? పెద్ది సినిమాలో అప్పలసూరి అనే పాత్ర కోసం ఈ స్టార్ నటుడు పూర్తిగా మారిపోయాడు. ఈ మధ్య తనకు అనువైన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జగపతి బాబు.. పెద్దిలో మాత్రం ఇలా పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు.

"పెద్దిలో అప్పలసూరిగా అద్భుతమైన జగపతి బాబు. ఓ బలమైన, ప్రభావవంతమైన పాత్రలో అతని మాస్టర్‌క్లాస్ పర్ఫార్మెన్స్ చూడటానికి సిద్ధంగా ఉండండి. పెద్ది మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది" అనే ...