భారతదేశం, ఆగస్టు 30 -- షాకింగ్.. పబ్లిక్ గా స్టేజ్ పై ఓ నటి నడుమును సింగర్ తాకిన వీడియో కలకలం రేపుతోంది. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల లగావేలు లిప్ స్టిక్ ఫేమ్ సింగర్ పవన్ సింగ్, నటి అంజలి రాఘవ్ లు లక్నోలో తమ కొత్త పాట సయ్యా సేవా కరేను ప్రమోట్ చేశారు. ఈ ప్రొగ్రామ్ లో అంజలి మాట్లాడుతుండగా పవన్ ఆమె నడుమును అసభ్యకరంగా తాకాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

అంజలి నడుమును పవన్ అనుచితంగా తాకిన వీడియో నెట్టింట హల్ చల్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటనపై ఎట్టకేలకు మౌనం వీడిన అంజలి భోజ్ పురి ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. పవన్ సింగ్ తన నడుమును అనుచితంగా తాకాడని అంజలి రాఘవ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో వీడియోలు పోస్టు చేసింది.

హిందీలో అంజలి మాట్లాడుతూ.. 'గత రెండు రోజులుగా నే...