భారతదేశం, డిసెంబర్ 12 -- బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన మూవీ 'అఖండ 2'. ఇది 2021 బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్. అఖండ 2 శుక్రవారం (డిసెంబర్ 12) థియేటర్లలో విడుదలైంది. గురువారం నుంచే ప్రీమియర్లు ప్రదర్శితమయ్యాయి. అనేక మంది ప్రేక్షకులు ఎక్స్ లో (గతంలో ట్విట్టర్) లో అఖండ 2 సినిమాపై తమ రివ్యూలను పంచుకున్నారు. కొందరు దీనిని '3 గంటల టార్చర్' అని అభివర్ణించారు.

మొదటి సినిమా అఖండతో పోలిస్తే ప్రేక్షకులను అఖండ 2 అంతగా ఆకట్టుకోలేకపోయిందని తెలుస్తోంది. "అఖండ 2.. 3 గంటల టార్చర్! బ్రెయిన్‌లెస్ రైటింగ్, సిగ్గులేని డైలాగ్స్, బాలయ్య ఓటీటీ అరుపులు. దిశానిర్దేశం లేని స్క్రీన్‌ప్లే, చౌకబారు వీఎఫ్ఎక్స్, లాజిక్ జీరో. తమన్ బీజీఎం మాత్రమే ఉపశమనం. పూర్తిగా డిజాస్టర్! డబ్బు, తెలివిని ఆదా చేసుకోండి! 0/5" అని ఒక నిరాశ చెందిన ఎక్స్ య...