భారతదేశం, మార్చి 10 -- బిహార్‌లోని అర్రా(Arrah) లో గల తనిష్క్ షోరూంలోకి చొరబడిన సాయుధ దొంగలు కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. దొంగలు తుపాకీతో సిబ్బందిపై దాడి చేసి షట్టర్ కు తాళం వేసి 30 నిమిషాల పాటు ఉద్యోగులను బందీలుగా ఉంచి విలువైన నగలతో పరారయ్యారు.

షోరూంలో ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలి చౌక్ బ్రాంచ్ లో ఈ చోరీ జరిగింది.

ఎనిమిది నుంచి తొమ్మిది మంది దొంగలు ఉన్నారని, పలుమార్లు ఫోన్ చేసినా పోలీసులు సకాలంలో స్పందించలేదని స్టోర్ మేనేజర్ పేర్కొన్నారు. ఎస్పీ పృచయ్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేశారు.

దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, వారి నుంచి రెండు పిస్తోళ్లు, 10 తూటాలు, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నామని బ...