భారతదేశం, డిసెంబర్ 21 -- బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. కచ్చితంటా టాప్-2లో నిలిచి, టైటిల్ కోసం పోటీపడతాడనేలా అంచనాలు పెంచిన ఇమ్మాన్యుయేల్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు! కనీసం టాప్-3లో కూడా చోటు దక్కించుకోకుండా ఇమ్మాన్యుయేల్ ఔట్ అయ్యాడనే వార్త సంచలనంగా మారింది. అతను నాలుగో స్థానంతో హౌస్ వీడాల్సి వచ్చిందని అంటున్నారు. మరి ఇమ్మాన్యుయేల్ కు దక్కిన బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎంతో చూద్దాం.

జబర్దస్త్ తో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు ఇమ్మాన్యుయేల్. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో అడుగుపెట్టినప్పటి నుంచి కామెడీతో పాటు టాస్క్ ల్లోనూ అదరగొట్టాడు. ఎంటర్ టైనర్ అనిపించుకున్నాడు. ఎలిమినేషన్ అనే ప్రాబ్లెం లేకుండానే టాప్-5 వరకూ వచ్చేశాడు. అతను కచ్చితంగా టాప్-3లో ఉంటాడనిపించింది. కానీ ఫైనల్ ఓటింగ్ లో ఇమ్ముకు దెబ్బ పడిందని తెలిసింది. దీంతో నాలుగో స్థానంతో...