భారతదేశం, మే 10 -- ఉత్తర్​ ప్రదేశ్​ మీరట్​లో దారుణ ఘటన చోటుచేసుకుంది! ఇంటికి ఫోన్​ చేసి డబ్బులు అడగమని చెప్పగా, అడగకపోవడంతో ఓ 13ఏళ్ల బాలుడిని అతని స్నేహితులు దారుణంగా హత్య చేశారు. వారిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై నిందితులు కాల్పులు జరిపారు. అంతేకాదు, ఆ ఐదుగురు నిందితులు మైనర్లు కావడం గమనార్హం!

మీరట్​ బిజ్నోర్​లోని హుస్సేన్​పూర్​ కాలా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్పీ అభిషేక్ ఝా తెలిపిన వివరాల ప్రకారం.. దీపక్ కుమార్ కుమారుడు ఆయుష్ ఈ నెల 6న హుస్సేన్​పూర్ కాలాలోని తన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తన కుమారుడు ఇంటికి తిరిగి రాలేదని శివాలా కాలా పోలీస్ స్టేషన్​లో మరుసటి రోజు దీపక్ ఫిర్యాదు చేశాడు. ఆ వెంటనే దీపక్ బంధువుల్లో ఒకరికి ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​కి రూ.5 లక్షల డిమాండ్ వచ్చింది.

దర్యాప్తులో భాగంగా ఇన్​స్టాగ్రామ్ ఖాతాపై సాంకేతిక నిఘా సా...