భారతదేశం, జనవరి 2 -- అది ఒక మామూలు రోజు.. కానీ ఆ వ్యక్తికి మాత్రం ఊహించని షాక్ తగిలింది! తన జేబులో ఉన్న మోటోరోలా స్మార్ట్‌ఫోన్ ఒక్కసారిగా పేలింది. ఆ వెంటనే మంటలు చెలరేగడంతో ఆ వ్యక్తి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అభిషేక్ యాదవ్ అనే ఎక్స్ వినియోగదారుడు షేర్ చేసిన ఈ వీడియో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ వీడియోను 'shubhxr_369' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి సేకరించారు. ఆ వీడియోలో బ్లూ కలర్​లో ఉన్న ఓ మోటోరోలా జీ-సిరీస్ ఫోన్ పూర్తిగా కాలిపోయి కనిపిస్తోంది. ఫోన్ వెనుక భాగం కరిగిపోగా, డిస్​ప్లే పగిలిపోయి, నల్లటి మచ్చలతో భయంకరంగా తయారైంది. ఆ ఫోన్ డిజైన్, రంగును బట్టి అది 'మోటో జీ54' మోడల్ అయి ఉండవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.

అయితే దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక స్...