భారతదేశం, మే 13 -- ప్ర‌భుదేవా హీరోగా న‌టించిన త‌మిళ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ జాలీ ఓ జింఖానా తెలుగులోకి వ‌స్తోంది. ఈ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్ క‌న్ఫామ్ అయ్యాయి. ఆహా ఓటీటీలో మే 15 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. జాలీ ఓ జింఖానా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆహా ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది. త‌మిళంలో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ మూవీ తెలుగులో మాత్రం డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌స్తోంది.

జాలీ ఓ జింఖానా మూవీకి శ‌క్తి చిదంబ‌రం ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీలో ప్రేమ‌మ్ ఫేమ్ మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. అభిరామి, యోగిబాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. విజ‌య్ బీస్ట్ మూవీలోని జాలీ ఓ జింఖానా అనే పాట నుంచి స్ఫూర్తి పొందుతూ ఈ మూవీకి టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కా...