భారతదేశం, జనవరి 8 -- న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు ఒక శుభవార్త, ఒక చేదు వార్త అందాయి. గాయం కారణంగా జట్టుకు దూరమైన వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి రీ ఎంట్రీకి రెడీ అయ్యాడు. కానీ టీ20 స్పెషలిస్ట్, హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ గాయం బారిన పడటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో తిలక్ ఆడటంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టి శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లోకి రాగా.. తిలక్ వర్మ సర్జరీ బాట పట్టేలా కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరు క్రికెటర్ల గాయాలు, ఫిట్‌నెస్ వివరాలు ఇక్కడ చూడండి. సిడ్నీలో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ బ్యాట్ పట్టాడు.

బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్య బృందం అయ్యర్ ఫిట్‌నెస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ...