భారతదేశం, జనవరి 8 -- అలిపిరి సమీపంలో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవనాన్నివేగంగా పూర్తి చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను, నిర్మాణంలో ఉన్న నూతన భవనాన్ని శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి వైద్యులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు.

ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ.. నూతన ఆసుపత్రి భవనం పూర్తి అయ్యే సమయానికి భవనానికి అవసరమయ్యే మానవ వనరులు, ఆపరేషన్ యంత్రాలు, ఫర్నీచర్, విద్యుత్ , తదితర మౌళిక సదుపాయాలను ముందస్తుగా సమకూర్చుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న జీ + 6 నూతన ఆసుపత్రి భవనంలో వైద్య సేవలు, పరిపాలన కోసం ఒక్కొక్క ఫ్లోర్ లో ఏ ఏ అంతస్తును ఉపయోగిస్తున్నారని. ప్రతి ఫ్లోర్ ను పరిశీలించారు. 6వ ఫ్లోర్ లో పూర్తిగ...