భారతదేశం, నవంబర్ 15 -- శ్రీసిటీకి 6 వేల ఎకరాల భూమిని కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే శ్రీసిటీని అభివృద్ధికి మోడల్ గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజైన శనివారం నాడు ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భాగస్వామ్య సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అలాగే శ్రీసిటీలోని ఏర్పాటైన 5 కంపెనీలను ప్రారంభించారు.

శ్రీసిటీలో కంపెనీలను ఏర్పాటు చేసేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..."భారత దేశంలో అత్యుత్తమ పారిశ్రామిక టౌన్ షిప్ శ్రీసిటి. శ్రీసిటి నుంచే డైకెన్, ఇసుజూ, క్యాడ్బరీ లాంటి ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తున్నాయి. వివ...