Andhrapradesh, జూన్ 22 -- శ్రీసత్య జిల్లాలోని రామగిరి మండల పరిధిలో 15 ఏళ్ల దళిత బాలికపై రెండేళ్లుగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బాలిక గర్భం దాల్చడంతో ఈ దారణం బయటికి వచ్చింది. జూన్ 9న బాధితురాలు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. నిందుతులపై పోక్సో, అట్రాసిటీ, బీఎన్ ఎస్ లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఈ కేసులో అచ్చంపల్లి వర్ధన్ (21), తలారి మురళి (25), బడగొర్ల నందవర్ధన్ రాజ్ (23), ఆరెంచెరు నాగరాజు (51), బోయ సంజీవ్ (40), బుడిద రాజన్న (49)లను జూన్ 9వ తేదీన అరెస్టు చేశారు. జూన్ 10న మరో ఏడుగురిని అరెస్టు చేయగా.. ప్రధాన నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు.

ధర్మ...