Andhrapradesh, జూలై 23 -- భారీ వర్షాలతో కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా మళ్లీ శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం పెరిగింది. దీంతో మరోసారి రెండు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు భారీగా ఔట్ ఫ్లో కూడా ఉండటంతో. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా. ప్రస్తుతం 883.80 అడుగులకు చేరుకుంది.ఇన్ ఫ్లో 76,143 క్యూసెక్కులుగా ఉండగా. ఔట్ ఫ్లో 1,21,996 క్యూసెక్కులు ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నీటినిల్వ 209.16 టీఎంసీలుగా నమోదైంది. ఈ సీజన్‌లో రెండోసారి గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుం...