భారతదేశం, డిసెంబర్ 2 -- శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళ్లే భక్తులకు శుభవార్త వచ్చేసింది.స్పర్శ దర్శనం,అతిశీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు ఉచితంగా లడ్డూలను పంపిణీ చేస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు.

రూ.500 స్పర్శ దర్శనం టికెట్లు, రూ.300 అతి శీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు మాత్రమే వీటిని పంపిణీ చేస్తారు. స్పర్శ దర్శనం టికెట్‌పై 100 గ్రాముల లడ్డూలు రెండు, రూ.300 దర్శనం టికెట్‌కు ఒక లడ్డూను అందజేస్తున్నారు.

ఈ ఉచిత లడ్డూల పంపిణీ కోసం ఆలయ అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆలయంలోని 9,10 కౌంటర్లలో మాత్రమే ఈ ఉచిత లడ్డూలను అందజేస్తారు. కాబట్టి టికెట్లు తీసుకున్న ఈ భక్తులు. ఈ కౌంటర్లను సంప్రదించి లడ్డూలను పొందవచ్చని అధికారులు సూచించారు.

Published by HT Digital Content Services with pe...