Telangana,hyderabad, ఆగస్టు 27 -- హైదరాబాద్ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి నిత్యం భక్తులు వెళ్తూనే ఉంటారు. ఇక స్పర్శ దర్శనాలు లేదా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన సమయంలో భక్తుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే భక్తుల సౌకర్యార్థం . తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. శివారు ప్రాంతంలో కొత్తగా బోర్డింగ్ పాయింట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

భక్తుల సౌకర్యార్థం శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న RGIA క్రాస్ రోడ్స్ వద్ద కొత్తగా బోర్డింగ్ పాయింట్ ని ఏర్పాటు చేసింది. ఎయిర్ పోర్ట్ నుంచి పుష్పక్ బస్సుల్లో సమీపంలో ఉన్న RGIA బోర్డింగ్ పాయింట్ కి భక్తులు చేరుకోవచ్చు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో శ్రీశైలానికి వెళ్లొచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

ఈ బోర్డింగ్ పాయింట్ నుంచి ప్రతి 20 నిమిషాలకో బస్సు శ్రీశైలానికి అ...