భారతదేశం, డిసెంబర్ 4 -- శ్రీశైల మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనంపై ఆలయ అధికారులు మరో ప్రకటన చేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో డిసెంబర్ 8వ తేదీ వరకు స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆలయంలో శివదీక్ష విరమణల రద్దీ కారణంగా రద్దీ ఎక్కువగా ఉందని ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

సిఫార్సు లేఖలతో వచ్చే వారికి కూడా స్పర్శ దర్శనం ఉండదని స్పష్టం చేశారు. డిసెంబర్ 5వ తేదీ వరకు రూ.5 వేల గర్భాలయ అభిషేకం, రూ.1,500 సామూహిక అభిషేకాలు ఉంటాయని వివరించారు.

మరోవైపు శ్రీశైలంలో స్పర్శ దర్శనం కోసం భక్తులు ఆన్ లైన్ ద్వారా భారీ సంఖ్యలో నమోదు చేసుకుంటున్నారు. అలాగే శివమాలధారులు కూడా భారీగా ఆలయానికి వస్తున్నారు. దీంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. ఫలితంగా స్పర్శ దర్శనానికి చాలా సమయం పడుతోంది. క్రమంగా రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో. ఈనెల 8వ తేదీ వరకు ...