Andhrapradesh,srisailam, జూలై 13 -- శ్రీశైలం భక్తుల రద్దీ కారణంగా ఈ వారం ఉచిత స్పర్శదర్శనం నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. జలాశయం గేట్లు తెరవడంతో గత రెండు రోజులుగా క్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ పెరిగిందని వివరించారు.

శ్రీశైలం క్షేత్రంలో భక్తుల రద్దీ ఈ వారమంతా కొనసాగే అవకాశం ఉందని ఈవో తెలిపారు. ముందస్తుగా ఉచిత స్పర్శ దర్శనాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. దీంతో జూలై 15 నుంచి 18వ తేదీ వరకు కల్పించే ఉచిత స్పర్శదర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

సర్వదర్శనం క్యూలైన్లలోని భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఈవో పేర్కొన్నారు. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాన్ని ఉద్దేశంతో ఉచిత స్పర్శదర్శనం నిలిపివేశామని వివరించారు. భక్తులందర...