భారతదేశం, ఫిబ్రవరి 13 -- శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శివరాత్రి దగ్గరపడిన నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13 నుంచి 16 వరకు దేవస్థానం, అటవీశాఖ టోల్‌గేట్ల వద్ద రుసుం మినహాయింపు ఇవ్వనుంది.

శ్రీశైలం వెళ్లే భక్తులు ప్రభుత్వం సూచిన చోట్ల ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆలయం, అటవీశాఖ టోల్‌గేట్ల దగ్గర టోల్ చెల్లించకుండానే వెళ్లొచ్చు. ఈ మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రకటన విడుదల చేశారు.

గత ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేయనున్నారు. నాల్గో రోజులపాటు ఈ అవకాశం ఉంటుంది. ఇక సాధారణ సమయాల్లో రాత్రి సమయంలో శ్రీశైలం వెళ్లేందుకు అనుమతించరు. బ్రహ్మోత్సవాల రద్దీ వేళ రా...