భారతదేశం, డిసెంబర్ 22 -- శ్రీశైలం దేవస్థానంలో అనుమతి లేకుండా రీల్స్, వీడియోలు చిత్రీకరించడం, డ్రోన్‌లను ఎగురవేయడం నిషేధమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని శ్రీశైలం దేవస్థానం ప్రకటించింది. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస రావు ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. నిబంధనల ప్రకారం దేవాలయ ప్రాంతంలో ఇతర మతాల ప్రచారం చేయడం, ఇతర మతాలకు సంబంధించిన కరపత్రాలు లేదా పుస్తకాలు పంపిణీ చేయడం, ఇతర మతాల చిహ్నాలను ధరించడం లేదా ప్రదర్శించడం నిషేధమని తెలిపారు.

అదేవిధంగా ఆలయంలో పరిసర ప్రాంతాలైన మాడ వీధులు, ఉప ఆలయాలు, పాతాళగంగ, పంచమఠాలు, శిఖరేశ్వరం, హటకేశ్వరం, పాలధార - పంచధార, సాక్షి గణపతి ఆలయం తదితర ప్రాంతాలలో ముందస్తు అనుమతి లేకుండా డ్రోన్‌లను ఎగురవేయకూడదు. వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి రీల్స్ రికార్డ్ చేయడం కూడా నిషేధమని అన్నార...