భారతదేశం, జనవరి 5 -- ఫిబ్రవరి 8 నుండి 18 వరకు జరగనున్న 11 రోజుల మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ఆలయ దేవస్థానం విస్తృతమైన సన్నాహాలు ప్రారంభించింది. మహా శివరాత్రి ఫిబ్రవరి 15న వస్తుంది. శాఖల వారీగా ఏర్పాట్లను చర్చించామని, నిర్ణీత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశామని దేవస్థానం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం, ధర్మకర్తల మండలి మద్దతుతో సన్నాహాలు జరుగుతున్నాయని ఈవో ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

పండుగకు ముందే భక్తులు వస్తారని అంచనా వేస్తున్నందున, పనులను వేగవంతం చేసి సరిగా భక్తులక సౌకర్యాలు అందించాలని ఆయా శాఖలను ఈవో ఆదేశించారు. గత సంవత్సరం కంటే ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా వేస్తూ సాధ్యమైన చోట 20-30 శాతం అదనపు సౌకర్యాలను కల్పించాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు.

నల్లమల అడవుల్లోని నా...