భారతదేశం, డిసెంబర్ 3 -- శ్రీశైలం మల్లన్న దర్శనానికి భారీగా భక్తులు వస్తున్నారు. దేవస్థానం భక్తులకు సమస్యలు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. అయితే తాజాగా ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించారు.

మల్లన్న దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. దీంతో నవంబర్ 7వ తేదీ దాకా సాధారణ భక్తులకు స్పర్శ దర్శనానికి రద్దు చేసింది దేవస్థానం. శివస్వాములకు మాత్రమే విడతల వారీగా స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. 7వ తేదీ వరకు సాధారణ భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది. స్వామివారి స్పర్శదర్శనం కోసం భారీగా భక్తులు నమోదు చేసుకుంటున్నారు. ఇంకోవైపు శివస్వాములు కూడా మాల తీసేందుకు వస్తున్నారు. దీంతో ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం...