Andhrapradesh, జూలై 6 -- ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల దాటికి కృష్ణా బేసిన్ లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటికే జూరాల ప్రాజెక్ట్ గేట్లు ఎత్తటంతో. శ్రీశైలం ప్రాజెక్ట్ కు భారీస్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ రేపోమాపో పూర్తిస్థాయి నిండిపోయే అవకాశం ఉంది. మరోవైపు క్రస్ట్ గేట్లను ఎత్తే విషయంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇవాళ(జూలై 6 ) ఉదయం 7:43 గంటల రిపోర్ట్ ప్రకారం. ప్రాజెక్ట్ కు చేరుతున్న ఇన్ ఫ్లో 1,34,790 క్యూసెక్కులుగా ఉంది. 67,399 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా. ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది. మరికొన్ని అడుగులు దాటితే. ప్రాజెక్ట్ నిండుకుండలా మారనుంది. ఆ తర్వాత గేట్లు ఎత్తే అవకాశం ఉంది. రేపోమాపో గేట్లు ఎత్తే విషయంపై ప్రకటన విడుద...