Andhrapradesh,telangana, జూలై 13 -- శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. అయితే వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో ఎత్తిన మూడు గేట్లను మూసివేసిన అధికారులు. ప్రస్తుతం ఒక్క స్పిల్ వే గేట్ ద్వారానే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇవాళ్టి (జూలై 13) ఉదయం రిపోర్ట్ ప్రకారం ఇన్ ఫ్లో 1,39,826 క్యూసెక్కులు కాగా. ఔట్ ఫ్లో 1,17,373 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 883.3 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

మరోవైపు గడిచిన నాలుగైదు రోజులుగా శ్రీశైలం రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. శనివారం భారీ ట్రాఫిక్ జామ్ సంభవించింది. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. పాతాళగంగా నుంచి దోమలపెంట చెక్ పోస్టు వరకు వాహనాల రద్దీ ఎక్కువగా...