భారతదేశం, సెప్టెంబర్ 29 -- పైన కురుస్తున్న వర్షాలకు ఏపీలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఇటు శ్రీశైలం ప్రాజెక్టు, అటు ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహనం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టు నుంచి వరద వస్తోంది. ప్రస్తుతం 6 లక్షలకుపైగా క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 10 గేట్లను 23 అడుగుల మేర ఎత్తి 5,90,772 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 5 వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 29,097 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం...