భారతదేశం, మే 18 -- తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ 'సింగిల్' కలెక్షన్లలో అదరగొడుతోంది. శ్రీవిష్ణు హీరోగా, కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మే 9న థియేటర్లలో విడుదలైంది. ఆరంభం నుంచి పాజిటివ్ టాక్‍తో ఈ మూవీ వసూళ్లలో దుమ్మురేపుతోంది. ఇప్పటికే రూ.25కోట్ల కలెక్షన్లకు చేరువైంది. ప్రస్తుతం సెకండ్ వీకెండ్‍లోనూ మంచి వసూళ్లను నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఈ తరుణంలో సింగిల్ సినిమా ఓటిటీ రిలీజ్‍పై రూమర్లు వస్తున్నాయి.

సింగిల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని జూన్ 6వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురానుందని అంచనాలు బయటికి వస్తున్నాయి.

థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్‍కు తెచ్చేలా ఈ సినిమా మేకర్లతో ఆ ప్లాట్‍ఫామ్ డీల్ చేసుకుందని సమాచారం. దాని ప్రకారం జూన్ 6న సింగిల్ మ...