Andhrapradesh,tirumala, జూన్ 19 -- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమ‌ల‌లో భ‌క్తుల‌ను ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బ‌స్సులు నడవనున్నాయి. ఈ మేరకు ఉచిత బస్సు స‌ర్వీసును టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

తిరుమ‌ల‌లోని అశ్వినీ ఆసుప‌త్రి స‌ర్కిల్ వ‌ద్ద గురువారం ఉద‌యం ఆర్టీసీ బ‌స్సుల ఉచిత ట్రిప్పుల‌ను టీటీడీ అద‌న‌పు ఈవో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ. తిరుమ‌ల‌లో ప్రైవేట్ వాహ‌నాలు భ‌క్తుల నుంచి వ‌సూలు చేస్తున్న అధిక ఛార్జీల‌ను అరిక‌ట్ట‌డంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు బ‌స్సుల‌ను ఉచితంగా తిప్పాల‌ని ఏపీఎస్ ఆర్టీసీని కోరిన‌ట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ అధికారులు త్వ‌రిత‌గ‌తిన బ‌స్సుల‌ను ఉచితంగా తిప్పేందుకు ముందుకు రావ‌డంతో కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు....