భారతదేశం, నవంబర్ 20 -- విరాళాల విషయంలో కచ్చితంగా సరైన సమాచారం తెలుకోవాలని శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విరాళం ఇవ్వవద్దని టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు విజ్ఞప్తి చేశారు.

Global Hindu Heritage Foundation, savetemples.org పేర్లతో వ్యవహరిస్తున్న కొందరు వ్యక్తులు తిరుమల, తిరుపతి, తిరుచానూరు ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు నవంబర్ 29న ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తు్న్నారని, మోసపూరిత చర్యలతో విరాళాలు సేకరించేందుకు భక్తులను తప్పుదారి పట్టిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని టీటీడీ ఛైర్మన్ తెలిపారు.

ఈ విధమైన సంస్థలకు విరాళాలు ఇవ్వకుండా, వారి వలలో పడకుండా భక్తులు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత...