భారతదేశం, మే 19 -- తిరుమల శ్రీవారి సన్నిధిలో నిర్వహించే తిరుప్పావడ, మేల్‌ఛాట్‌ వస్త్ర సేవల్లో పాల్గొనడానికి తీవ్రమైన పోటీ ఉంటుంది. ఈ క్రమంలో 2021లో సేవల్లో పాల్గొనేందుకు 2008లో ఓ భక్తుడు దరఖాస్తు చేసుకున్నాడు. టీటీడీ లక్కీ డ్రాలో అతనికి అవకాశం దక్కింది.

కోవిడ్‌ కారణంగా తిరుమలలో సేవల్ని రద్దు చేయడంతో ఆ భక్తుడికి మేల్‌ఛాట్ వస్త్ర సేవల్లో పాల్గొనే అవకాశం దక్కలేదు. కోవిడ్ ఆంక్షల కారణంగా ఆర్జిత సేవల్ని రద్దు చేయడంతో ఆ తర్వాతి కాలంలో తిరుప్పావడం, మేల్‌ఛాట్‌ సేవల్లో పాల్గొనేందుకు అనుమతించలేమని టీటీడీ తేల్చేసింది.

టీటీడీ తీరుపై మహబూబ్‌నగర్‌కు చెందిన భక్తుడు విని యోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి విజయం సాధిం చారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యాపారవేత్త శెట్టి చంద్రశేఖర్ దంపతులతో పాటు, వారి కుమా రుడు, కోడలు తిరుమల శ్రీవారికి ప్రతి గురువారం నిర...